‘జాంబీ డీర్ డిసీజ్’ వేగంగా విస్తరిస్తోందని కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్‌ను ప్రస్తుతం జింకల్లో కనుగొన్నామని, ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు ఏదైనా మెదడువాపు లాంటి తీవ్రమైన సమస్యలతో చనిపోతోందని, ఇది సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ గుండా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.