జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులను వాలంటీర్లు చేసి రూ.5,200 జీతంతో ఊడిగం చేయిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతలో ఉన్న సామర్థ్యాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. డిగ్రీ చదువుకున్న వాళ్లను ఐదు వేలకు పని చెయ్యమంటున్నారంటే అది ఉద్యోగమా? ఊడిగమా? అని ప్రశ్నించారు.