తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మహాబలిపురంలో విషాద ఘటన జరిగింది. వినోద్ కుమార్, రూపిణి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు. వినోద్ మద్యానికి బానిస అయ్యాడు.
ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15న వినోద్ బాగా మద్యం తాగి వచ్చాడు. కోపంలో భార్యపై వేడి నీళ్ళు విసిరాడు. అయితే ఆ నీళ్లు చిన్నకుమారుడు సువిన్(4)పై పడ్డాయి. చికిత్స పొందుతూ బాలుడు మంగళవారం చనిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa