ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది.
ఏపీలో ఈ సారి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాలు, వైసీపీ 8 స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ప్రస్తుతం వైసీపీకి 22 ఎంపీ స్థానాలు ఉండగా.. 14 స్థానాలు కోల్పోతుందని సర్వేలో పేర్కొంది.