పంటకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300కార్లు, 10మినీ బస్సులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తీసుకెళ్తున్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని హరియాణా పోలీసులు.. పంజాబ్ బలగాలను అభ్యర్థించాయి.