ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాలంటీర్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పాలపాడుకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్ ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
శ్రీకాంత్ వేధింపులు రోజు రోజుకు పెరిగాయి. బాధిత యువతితో పాటు ఆమె చెల్లిని కూడా టార్గెట్ చేశాడు. వేధింపులు భరించలేక యువతి బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది.