పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో ఫిబ్రవరి 16న జరిగిన బాలుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. శాంత శర్మ అనే మహిళకు శ్రేయాన్స్ (8) అనే కొడుకు ఉన్నాడు. ఇక శాంత శర్మ స్వలింగ సంపర్కురాలు.
ఇష్రత్ పర్వీన్ అనే మరో మహిళతో ఆమెకు ఎఫైర్ ఉంది. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా శ్రేయాన్స్ చూశాడు. దీంతో బాలుడిని కన్నతల్లి, ఆమె ప్రియురాలు ఇష్రత్ పర్వీన్ కిరాతకంగా హతమార్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.