కుందుర్పి మండల కేంద్రంలో గుజరిషాప్ లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విద్యుత్ రాగి వైర్లను బయట కాల్చి తిరిగి రాగి వైరును వ్యాపారం నిర్వాహకుడు దుకాణంలో వేశాడు. రాగి వైరులో ఉన్న నిప్పు మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు రూ. 1, 50, 000లు దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.