మహిళల అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని బుధవారం ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబ శివారెడ్డి తెలియజేశారు. నార్పల మండల కేంద్రంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు " వై. యస్. ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ది చెక్కు పంపిణీ పండుగలా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సమన్వయకర్తలు వీరాంజనేయులు, శంకర్ నారాయణ హాజరయ్యారు.