సర్పంచుల హక్కులను కాల రాసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పనిచేద్దామని బుధవారం శింగనమల టిడిపి నాయకులు, జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యవర్గం తీర్మానం చేసింది. జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో 12918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రాంత ప్రజలను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు.