మార్చి నెల రెండో వారం లో అనంత జిల్లాలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ డీఆర్వో రామకృష్ణ రెడ్డి బుధవారం అన్నారు. పదో తరగతి పరీక్షలు కోసం 142 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 40, 063 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వివరించారు. వీటితో పాటు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు కూడ జరుగుతాయన్నారు.