పేదల అభివృద్ధి సీఎం వై ఎస్ జగనన్నతోనే సాధ్యం అని రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంను చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడప గడపకు వెల్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.