ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని కోర్టుల్లో మార్చి 9న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి దీన బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10. 30 గంటలకు అదాలత్ ప్రారంభమవుతుందన్నారు. ఇందులో రాజీపడదగిన క్రిమినల్, వినియోగదారుల ఫోరం, పంచాయతీ, మున్సిపాలిటీ పన్నులు, ప్రీలిటిగేషన్ కేసుల్లో పరిష్కారం పొందవచ్చన్నారు.