సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో గత ప్రభుత్వ హయాముకి ప్రస్తుతం జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన ఆధునికీకరించిన రక్త పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సాధారణ పరీక్షలకై రక్త నమూనాలు అందించారు. పేద వర్గాలు ప్రభుత్వ ఏరియా వైద్యశాల సేవను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.