రక్తదానం మహాదానమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రం, మరో రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసిన ల్యాబ్ పరకరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫైరోజా బేగం, వైద్యులు, వైద్య సిబ్బంది, సర్పంచ్ గంగులమ్మ, నాయకులు చింతల ఆనంద రెడ్డి, నీళ్ళ భాస్కర్, అబ్దుల్ కలీమ్ పాల్గొన్నారు.