అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన లీగల్ సెల్ సమావేశంలో పలువురు న్యాయవాదులు కొండబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొండబాబు వీరికి తెదేపా కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు.