మాఘమాసం 12వ రోజు గురువారం శెట్టూరు మండలం కైరేవు గ్రామంలోని అతి పురాతన ఆలయంలో శివ మాలాధారులు రేగటి లోకేష్, గొంచికార కార్తీక్ ల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూలతో అలంకరించి శివ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివ మాలాధారులు నిత్యం శివాలయంలో ఉంటూ తమ దీక్షలను కొనసాగిస్తున్నారు.