రామగిరి మండలం పెద్దయ్య గారి కొట్టాలు గ్రామానికి చెందిన రమాదేవి (35) విద్యుత్ షాక్ తో బుధవారం మృతి చెందింది. ఇనుప రేకుల షెడ్డుతో చేసిన స్నానాల గదిపై కరెంట్ వైర్ తెగిపడటంతో షెడ్డు అంతా విద్యుత్ వ్యాపించింది. దీన్ని గమనించకుండా స్నానాల గదిలోకి రమాదేవి వెళ్లగా కరెంటు షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందింది. రమాదేవికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.