పుట్టపర్తి మండలం బీడుపల్లి జెడ్పీ హైస్కూల్ హెచ్ ఎం లక్ష్మీదేవిని గురువారం సస్పెండ్ చేస్తూ ఆర్జేడి రాఘవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో హెచ్ ఎం వ్యవహార శైలిపై అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణలు చేపట్టిన డిఈఓ మీనాక్షి నివేదికను ఉన్నత అధికారులకు పంపారు. నివేదికను పరిశీలించిన ఆర్జెడి హెచ్ఎం సస్పెండ్ చేశారు.