రైతు ప్రభుత్వం అని గోప్పులు చెప్పుకొంటున్న వైకాపా ఐదేళ్లగా సాగునీటి వనరులను నిర్వీర్యం చేసిందని నాగబాబు ఆరోపించారు. ఉమ్మలాడ వద్ద శారదా నదిపై గోడారి ఆనకట్టను బుధవారం పరిశీలించారు.
ఈ నదిపై గ్రోయిన్లు దెబ్బతిన్నాయని వైకాపా వీటిని గాలికొదిలేసిందన్నారు. సాగునీటి కాలువలు పూడిక పోయాయన్నారు. ఆయకట్టు భూములకు చుక్క సాగునీరు పారని పరిస్థితి నెలకొందన్నారు.