రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గురువారం రాజమండ్రిలోని 22వ వార్డులో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తుందని అన్నారు. ప్రజలు మళ్లీ వైఎస్ఆర్సిపిని గెలిపించాలని కోరారు.