ఎమ్మెల్యే కన్నబాబు పైఅవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని జడ్పీటీసీ సభ్యులు లాలం రాము, నాయకులు నర్మాల కుమార్, కోన బుజ్జి మండిపడ్డారు.
సెజ్ కంపెనీల్లో అక్రమాలు, అన్యయాలు చేస్తున్నారని బినామీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలపై వైకాపా నాయకులు బుధవారం అచ్చుతాపురం విలేకర్ల సమావేశం నిర్వహించి ఖండించారు. సెజ్ కంపెనీల్లో పనులకు, అవినీతి అక్రమాలకు ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నారు.