అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డులో గోతులను తక్షణం పూడ్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. లోకనాథం కోరారు. హరిపాలెంలో సీపీఎం మండల కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సొంత ఖర్చుతో గోతులు పూడ్చుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఇప్పటికైనా పనులు ప్రారంభించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. నాయకులు కె. రామసదాశివరావు, బుద్ద రంగారావు, కన్నాంనాయుడు, బాబూరావు, రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు