తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ పార్వతీపురం, గుమడ స్టేషన్ల మధ్య 3వ లైన్ కు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి గురువారం తెలిపారు.
ఈ నెల 29న ఎర్నా కుళం-టాటా ప్రత్యేక రైలు 2 గంటలు, మార్చి 1న ఈరోడ్-సంబల్ పూర్ ప్రత్యేక రైలు గంటలు, 3న విశాఖ- లోకమాన్యతిలక్ ఎక్స్ ప్రెస్5 గంటలు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేశారన్నారు.