చీరాల రూరల్ ఎస్ఐ శివకుమార్ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈపూరుపాలెం లో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలు లేని, హెల్మెట్లు ధరించని వాహనదారులకు ఆయన జరిమానాలు విధించారు. మొత్తం 20 కేసులు నమోదు చేసి 2900 రూపాయల మేర జరిమానా విధించినట్లు ఆయన గురువారం తెలిపారు. వాహనదారులు రోడ్డు మీదకు వచ్చేటప్పడు తప్పనిసరిగా అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధారణ తప్పనిసరని ఎస్సై చెప్పారు.