ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఎస్. ఐ అంకమ్మ రావు పాల్గొని ప్రారంభించారు. సమితి ప్రెసిడెంట్ పూల బాబు, గౌరవ అధ్యక్షుడు బషీర్ ఖాన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.