కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న పురాతన వాటర్ ట్యాంక్ ను తొలగించాలని సి అండ్ ఐ జి జి ఎం చర్చి వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కాలంలో పురాతనమైన వాటర్ ట్యాంక్ సంబంధించిన మోడలింగ్ కు సంబంధించిన పేచ్చులు ఊడి కింద పడుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో సి అండ్ ఐ జి ఎం చర్చికి వచ్చే భక్తులకు, సభ్యులందరికీ ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్ తొలగించాలని ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.