లక్కిరెడ్డిపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రాయచోటి వీరభద్రస్వామి ఆలయం వరకు తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు రామాపురం,లక్కిరెడ్డిపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసుకుని అనంతరం గంగమ్మ తల్లి ఆలయంలో పూజల అనంతరం పాదయాత్రతో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలోని చిట్లూరు, పాలన్నగారిపల్లె, టోల్గేట్, ఆర్ఆర్ స్టోన్ వద్ద భోజనాల అనంతరం మళ్లీ పాదయాత్ర మాసాపేట, ఠానా మసీదు ప్రార్థనలో అనంతరం గాంధీ బజారు ద్వారా శ్రీవీరభద్ర స్వామి ఆలయం చేరుకుంటామన్నా రు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఆర్ అభిమానులు, బంధువులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.