ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక అక్రమ దోపిడీపై నిరసనకు దిగుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 12:17 PM

వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నం,కొండపల్లి మున్సిపాలిటీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల బ్రోచర్లను ప్రజలకు పంచారు. జగన్‌ చేస్తున్న ఇసుక అక్రమ దోపిడీపై ఈనెల 24న టీడీపీ - జనసేన ఆందోళన చేస్తాయని ఆయన తెలిపారు. అరాచక, అవినీతి జగన్‌ ప్రభుత్వాన్ని 165 అడుగుల గోతిలో పెట్టాలన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో రూ.11 కోట్లు అవినీతి చేశారని, అడ్డగోలుగా పన్నులు వేసి దోపిడీ చేసి వైసీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నంను బూడిదపట్నం చేశారన్నారు. మైలవరంలో ఈనెల 28న 48 కంపెనీలతో కేశినేని ఫౌండేషన్‌ అధినేత కేశినేని శివనాథ్‌(చిన్ని) ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తామని, ఈఅవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ కౌన్సిలర్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com