ఆంధ్రప్రగతి గ్రామాణ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హను మంతరెడ్డి అధ్యక్షతన కర్నూలు భాగ్యనగర్ బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ..... కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, పూర్తి పెన్షన్ అమలు చేసి గ్రాడ్యుటీ సర్వీసు రూల్ ప్రకారం చెల్లించాలని, అర్హులందరికీ పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగు సమ్మెకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీఅంజిబాబు సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.