చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామంలో శుక్రవారం వారు కార్యకర్తలతో కలిసి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి ప్రజలకు మినీమేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ పథకాల గురించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. అభివృద్ధి మచ్చుకు కూడా కానరావడం లేదన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. అందుకు ప్రతిఒక్కరూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. తర్వాత ప్రజలతో స్థానిక సమస్యలపై ఫిర్యాదులను చైతన్య రథంలోని బాక్సులో వేయించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పోతుకుంట లక్ష్మన్న,మాజీ జడ్పీటీసీ రామాంజనేయులు, సర్పంచ ముత్యాలనాయుడు, నాయకులు గొట్లూరు శ్రీనివాసులు, విజయసారథి, భాస్కర్చౌదరి, రాఘవరెడ్డి, విజయ్చౌదరి, నరసింహులు, సూరి, వెంకటేష్, బోయ రమణ, రాంపురం శీనా, పోతుకుంట రవి తదితరులు పాల్గొన్నారు.