ఒకవైపు పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాలని ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మరోవైపు ఉద్యోగ సంఘాలతో కాలయాపన కోసం చర్చలు జరుపుతోందని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఈ మేరకు శనివారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చిత్త శుద్ధి ఉంటే చర్చలతో కాలయాపన చేయకుండా వెంటనే సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.