ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని.. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు.