రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కనిగిరి టీడీపి ఇన్ ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఉగ్ర మాట్లాడుతూ 57నెలల పాలనా కాలంలో 14 లక్షల అసైన్డ్ భూములను కబ్జా చేసిన జగన్ రెడ్డి ముఠా ప్రజా ద్రోహులు కాదా అని ప్రశ్నించారు.