మద్దిపాడు మండలంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని ఏఈ సురేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ, గృహాలకు వినియోగించే వారు గడువులోపు విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలన్నారు. ఈనెల 26లోపు విద్యుత్ బిల్లులు చెల్లించి అపరాధ రుసుం భారిన పడకుండా చూసుకోవాలని కోరారు.