అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అధిష్టానం కేటాయించింది. దాంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు.
టీడీపీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు టీడీపీ జెండాలు, కరపత్రాలను దగ్ధం చేశారు.