తన భర్త రామాంజనేయులు రెడ్డికి, తనకు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
మాట వినకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే, అతని వెంట వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కౌన్సిలర్ ఎస్పీని కోరారు.