ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే.. 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు . పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. ఈ ప్రకటన పట్ల మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పల్లకి మోయడానికి తప్ప, పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.