కరోనా ప్రపంచ దేశాలను వణికించింది. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇలాంటి వైరస్ వస్తదని ఎవరూ ఊహించలేదు. కోట్లాది మంది ఈ వైరస్ైకు బలై చనిపోయారు.ఆ తర్వాత వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కోవిడ్ భూతానికి కళ్లెం పడింది. అయితే, ఈ కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను 'వ్యాక్సిన్' సైన్స్ జర్నల్ ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశోధనా విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్ పరిశోధకులు కోవిడ్-19 వ్యాక్సిన్లు 'ప్రత్యేక ప్రతికూల సంఘటనలు'గా పరిగణించే 13 వైద్య సమస్యలను తీవ్రతరం చేసినట్టు గుర్తించారు.
తాజాగా పలు దేశాల్లో కోవిడ్ టీకా తీసుకున్న 99 మిలియన్ల మందిపై అధ్యయనం నిర్వహించారు. అర్జెంటినా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, స్కాట్‌లాండ్ లాంటి దేశాల ప్రజల నుంచి వివరాలు సేకరించారు. MRNA టీకా తీసుకున్న వారిలో హృదయ కండర వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ ముప్పును గుర్తించారు. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఎన్ఏ టీకాలే. ఈ టీకాలు ఒకటి, రెండు, మూడో డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను కనుగొన్నారు. రెండో మోతాదు తీసుకున్న తర్వాత అంచనా రేటుతో పోలిస్తే 6.1 రెట్లు ఎక్కువగా ఈ ముప్పు కనబడడం గమనార్హం.
ఆస్ట్రాజెనెకా టీకా మూడో డోసు తీసుకున్న తర్వాత గుండెకు సంబంధించిన మరో ముప్పు అయిన పెరికార్డిటిస్ ప్రమాదం 6.9 రెట్లు పెరిగినట్టు గుర్తించారు. అలాగే, మోడెర్నా టీకా మొదటి, నాలుగో మోతాదు తీసుకున్న వారిలో వరుసగా 1.7 రెట్లు, 2.6 రెట్లు ఈ ప్రమాదం పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. అలాగే, ఆస్ట్రాజెనెకా షాట్ తీసుకున్న వారు అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన గ్విలియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రక్తం గడ్డకట్టే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం తేల్చింది.మోడెర్నా టీకా తీసుకున్న తర్వాత న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ వచ్చే ప్రమాదం 3.8 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత ఈ ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు నివేదించింది. కరోనా టీకా వల్ల కలిగే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు.