మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్యాకేజీ స్టార్ సీటుపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదని,
24 సీట్లు తీసుకున్న పవన్ ఎలా సీఎం అవుతాడని ఆయన ప్రశ్నించారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామనే భ్రమలో ఉన్నారన్నారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.