జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు సీట్ల కేటాయింపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పవన్ వెంటనే స్పందించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని, సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి ఓటు వేసేదే లేదని కాపు సంఘాలు తేల్చి చెబుతున్నారు.