ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ టార్మ్ థార్‌పై మిస్సైళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ట్యాంకర్ నౌకకు కానీ, సిబ్బందికి గానీ ఎలాంటి నష్టం జరగలేదు. దీనిపై అమెరికా మాత్రం ఇంకా స్పందించలేదు.