నేటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొననున్న'మేము సిద్దం - మా బూత్ సిద్ధం' సమావేశం ఏర్పాట్లను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీనేతలు పరిశీలించారు. మంగళగిరిలోని CK కన్వెన్షన్ లో మంగళవారం జరగనున్న 'మేము సిద్దం - మా బూత్ సిద్ధం' సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు,రీజనల్ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీయస్ మండల ఇంచార్జిలు, నియోజకవర్గ ఎన్నికల బూత్ ఇంఛార్జ్, జేసీయస్ నియోజకవర్గ ఇంఛార్జ్, నియోజకవర్గ ఎలక్షన్ హెడ్, పార్టీ పరిశీలకులు మరియు జిల్లా జేసీయస్ కో-ఆర్డినేటర్లు పాల్గొననుండటంతో వారికి సౌకర్యవంతంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో పార్టీ నేతలకు,భధ్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న వేదిక సమీపంలో ఏర్పాట్లు, సమీపంలోని పలు సమావేశమందిరాలలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో వారికి తెలియచేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జరగబోయే కీలకమైన సమావేశం ఇది అన్నారు. క్షేత్రస్థాయి...మండల స్దాయి,పోలింగ్ బూత్ స్దాయిలో కీలకంగా వ్యవహరించే కార్యకర్తల సమావేశం ఇది అని అన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులు, జేసిఎస్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ ఇన్ ఛార్జ్ లు, నియోజకవర్గాలలో ఎన్నికలను పర్యవేక్షించే నేతలు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి,మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు ఈ సమావేశంలో భాగంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులను ఉధ్దేశించి కీలకమైన ప్రసంగంతోపాటు దిశానిర్దేశం చేస్తారని తెలియచేశారు. ఎన్నికలలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.ప్రత్యర్దులి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూసుకోవాలి.ప్రజలలో మమేకమై ఇంతకాలంగా చేస్తున్న పనులను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లేలా ఏమి చర్యలు తీసుకోవాలి.వారి ఆశీస్సులు ఏవిధంగా కోరాలో ముఖ్యమంత్రి వివరిస్తారు. మా పార్టీ అభ్యర్దుల ఎంపిక దగ్గర్నుంచి గడపగడపకు మన ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర్నుంచి వైయస్సార్ సిపి ఎప్పుడు ప్రజలలోనే ఉంది. నాయకులు ఎప్పుడు ప్రజలలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చేస్తున్న పనుల గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేప్రయత్నం నిరంతరం జరుగుతుంది.ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది ఎన్నికల టీమ్ ను ఏర్పాటుచేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో పూర్తి అయింది. అందులో భాగంగానే కమిటీలను నియమించాం.ఇప్పుడు పోలింగ్ బూత్ స్దాయిలో కమిటీలు కూడా తయారయ్యాయన్నారు. సమర్ధంగా పనిచేయగల పోలింగ్ బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేశాం.వారికి ఓరియెంటేషన్ ఇచ్చే ప్రక్రియ రేపు జరుగుతోంది అని వివరించారు.