ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2023-24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు రూ.1,078.36 కోట్ల సాయం అందించనుంది. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో సొమ్మును జమ చేయనున్నారు.