ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని, రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేసారని రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ విమర్శించారు. బుధవారం అయన మాట్లాడుతూ, కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేశారని, మధ్య నిషేధం చేస్తానని చెప్పి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.