పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది.
బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయినవారిలో మాలి పౌరులతోపాటు ఇతరులు కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.