పెద్దవడుగూరు మండలంలో జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇంఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పర్యటించారు. మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామంలో మండల వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డిని గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.