ఈనెల 29 లోపు వ్యాపారులు తమ సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేయించుకోవాలని కనిగిరి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వై సుబ్బరాయుడు పేర్కొన్నారు. మంగళవారం కనిగిరి పట్టణంలో పలు దుకాణాలను పరిశీలించి వ్యాపారులకు రెన్యువల్ ప్రాముఖ్యతను తెలిపారు. రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వ్యాపార నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.