ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని వైసిపి అధిష్టానం దూరం పెట్టిన విషయం తెలిసిందే. కాగా 2 రోజులుగా ఒంగోలులో తన కార్యాలయంలో తన అనుచరులతో సమావేశమైన ఎంపీ మాగుంట, టిడిపి పార్టీలోకి చేరుతున్నట్లుగా ఊహాగానాలు ఉపందుకోగా బుధవారం ఉదయం 9 గంటలకు ఎంపీ మాగుంట తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏ విషయం పై మాట్లాడతారా అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.