అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామ సమీపంలో చిరుత పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రాంతంలో చిరుత పులి తిరుగుతూ ఉండడంవల్ల స్థానిక రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గన్నేపల్లి గ్రామానికి చెందిన రైతు వలిని చిరుత పులి తన పిల్లలతో వెంబడించినట్లుగా రైతు వలి బుధవారం తెలిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ రైతు గ్రామములోకి పరుగులు పెట్టాడు. తర్వాత గ్రామస్తులు పులిని అడవిలోకి తరిమి వేశారు.